క్రైస్తవ సోదరులకు ఘనంగా విందు
రామారెడ్డి డిసెంబర్ 5 ( జనంసాక్షి ) :
క్రైస్తవ సోదరులకు ఘనంగా విందు నిర్వహించారని అన్నారు. రామారెడ్డి పెంతకోస్తు , రెడ్డిపేట్ గ్రామంలో ఫిలదేల్పీయ చర్చ్ ఆద్వర్యంలో న్యూయార్ వేడుకలు ఘనంగా నిర్వహించారని చెప్పారు. ఈ. సందర్భంగా ఫాస్టర్లు ఆమోస్ , జాసువా మాట్లాడుతూ, క్రిస్మస్ పండగను పురస్కరించుకుని న్యూయిర్ వేడుకలు ఘనంగా జరిగాయ న్నారు. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దార న్నారు. క్రైస్తవ సోదరులు చర్చిలలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు జరిపారని అన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపమని అన్నారు. ఈ పండగకు ప్రభుత్వ పరంగా దుస్తులు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ధన్యవాదాలు తెలిపామన్నారు. జిల్లాలో మంత్రులు, అధికారులు పేద క్రైస్తవులకు తమ చేతులు మీదుగా దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు . ఈపండుగ నిర్వహించిన నేపథ్యంలో పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో రెడ్డి పేట మాజీ సర్పంచ్ నర్సగౌడ్ , వివిధ గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు జిల్లా నాయకు లు మండల నాయకులు క్రిస్టియన్ సోదరీ సోదరీ మణులు క్రిస్టియన్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు




