Tuesday, 3 November 2026

క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు- జేఈవో

తిరుమల, (మార్చి 27) : క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ  జేఈవో శ్రీనివాసరాజు భక్తులకు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులున్నా జేఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. జేఈవో  శ్రీనివాసరాజు శుక్రవారం ప్రధాన కల్యాణకట్టలో తనిఖీలు  నిర్వహించి  భక్తులకు అందుతున్న సౌకర్యాలపై  ఆరా  తీశారు. క్షురకులు  సేవాభావంతో పనిచేయాలని  జేఈవో హితవు చెప్పారు. తలనీలాలు సమర్పించే భక్తులు క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వేసవి రద్దీ దృష్ట్యా అదనంగా శ్రీవారి సేవకులను నియమిస్తామని  టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *