Tuesday, 3 November 2026

క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన ఏ డి ఏ పద్మ

 

 

 

 

 

 

 

చిలప్ చెడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- మండలంలోని బండపోతుగల్ ఫైజాబాద్ గ్రామాలలో ఏడిఏ పద్మ, ఏఈఓ భూపాల్ తో కలిసి వరి పంటలో వచ్చే చీడపీడలు, వాటి యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏడిఏ పద్మ మాట్లాడుతూ యాసంగి సీజన్ లో ముందుగా నాటుకున్న వరి పొలాల్లో కాండం తొలుచు పురుగు మరియు జింక్ లోపం ఉధృతంగా ఉందని గమనించామన్నారు. కాబట్టి కాండం తొలుచు పరుగు నివారణ కొరకు వరి నాటుకున్న 15 రోజుల లోపు ఎకరానికి కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 4g గుళికలు 8 కిలోలు లేదా క్లోరంట్రానిలిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోల చొప్పున వేసుకోవాలని సూచించారు. వరి నాటు వేసిన 25 రోజుల తరువాత పురుగు ను గమనిస్తే కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 2gr లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అదేవిధంగా జింక్ లోప నివారణకు చిలేటెడ్ జింక్ 1gr లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైజాబాద్ ఎంపీటీసీ సంగా గౌడ్, రైతులు గోపాల్, విభీషన్ తది తరులు పాల్గొన్నారు