Tuesday, 3 November 2026

గొల్లపల్లిలో పంచాయతీ సమావేశం.

 

 

 

 

 

 

 

ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచ్.నెన్నెల, ఫిబ్రవరి 7, (జనంసాక్షి ) మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం సర్పంచ్ ఇందూరి శశికళ రమేష్ అధ్యక్షతన వార్డ్ సభ్యులతో గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఇంటి పన్ను వసూళ్ళు, మన ఊరు మన బడి, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా, అంగన్వాడి సెంటర్ కు స్వంత భవనం లేక పురిగుడిసే లో నడుపబడుతుంది, అంగన్వాడీ కేంద్రంలో వసతులు సరిగా లేవని వార్డు సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. పలు అభివృద్ధి పనులపై చర్చలు, తీర్మానాలు చేశారు. ఈసమావేశంలో పంచాయతీ కార్యదర్శి రంజిత్, ఉపసర్పంచ్ నారాయణ, వార్డ్ సభ్యులు గంగమల్లు, శ్రీనివాస్, ప్రమోద్, ఉమాదేవి పాల్గొన్నారు.