
పెనుబల్లి, జూన్ 29(జనం సాక్షి)జులై 2వ తేదీన ఖమ్మంలో జరుగు తెలంగాణా ప్రజా గర్జన సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని మాజీ ఆత్మ కమిటి ఛైర్మన్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం పిలుపునిచ్చారు, ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణ పి సి సి అద్యక్షులు రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి విచ్చేయుచున్న సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని, తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వ నియంత పాలనకు చరమగీతం పాడి, ఈ తెలంగాణా ప్రజా గర్జన సభ ద్వారా బిఆర్ఎస్ పార్టీకి గట్టిగా సందేశం పంపాలని కొరారు.




