జనం సాక్షి /కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు మృతికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని సర్పంచ్ గడ్డమీద నర్సింలు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయి చందు మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని తన ఆటపాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఇచ్చిన సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలోపోతనశెట్టిపల్లి సర్పంచ్ గడ్డమీది నరసింహులు సోమ నర్సింలు కొల్చారం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ప్రచార కార్యదర్శి పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాజా గౌడ్ యువత నాయకులు ఎక్కడ ప్రశాంత్ బైకర్ శ్రీకాంత్ విట్టల్ అన్వేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
సాయిచంద్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు సోమ నర్సింలు




