Monday, 2 November 2026

రెండు మతాల పర్వదినాలు ఒకేరోజు రావడం చాలా సంతోషం – తొలి ఏకాదశి, బక్రీద్ పర్వదిన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ జూన్ 29 (జనంసాక్షి): రెండు మతాల పర్వదినాలు ఒకేరోజు రావడం చాలా సంతోషమని హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తొలి ఏకాదశి, బక్రీద్ పర్వదినాల సందర్భంగా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం తెల్లవారుజామున మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పుణ్య క్షేత్రాన్ని దర్శించుకొని నది స్నానం ఆచరించి, ప్రత్యేక పూజా కార్యక్రమములో పాల్గొన్నారు. అనంతరం మండలంలోని వేపాలసింగారం గ్రామంలో బక్రీదు పర్వదిన సందర్భముగా ఈద్గా వద్ద ప్రార్ధనలో పాల్గొని, ఈద్గా వద్ద స్టేజి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, వేపాల సింగారంలోని ముస్లిం ఖభారస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సమాజాలలో అసలైన సెక్యులరిజం వర్ధిల్లుతుందని, ప్రజలందరూ కలిసిమెలిసి పర్వదినాలు ఆనందంగా జరుపుకుంటున్నారని, తెలంగాణలో ఎల్లప్పుడూ గంగాజమున తహసిబ్ వికాసిస్తుందని తెలియజేస్తూ ఈ సందర్బంగా ప్రజలందరికీ తొలిఏకదాశి, బక్రీదు పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వేపల సింగారం సర్పంచ్ అన్నెం శీరీషకొండారెడ్డి, ముడెం గోపిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.