Friday, 6 November 2026

ఖమ్మం డిసిసి కార్యాలయంలో నెదర్లాండ్ డెలిగేట్స్ ను సన్మానించిన డిసిసిబి డైరెక్టర్ చావా వేణు

ఖమ్మం డిసిసి కార్యాలయంలో నెదర్లాండ్ డెలిగేట్స్ ను సన్మానించిన డిసిసిబి డైరెక్టర్ చావా వేణు

ఖమ్మం.తిరుమలాయపాలెం (డిసెంబర్ 09) జనంసాక్షి..రాబో బ్యాంక్ నెదర్లాండ్, మాస్టర్ కార్డ్(యు.ఎస్.ఎ) బేయర్ జర్మనీ భాగస్వామ్యంతో వ్యవసాయ మార్పిడి ప్లాట్ ఫాం ద్వారా ప్రాథమిక సహకార సంఘాలను మరియు ఎఫ్.పి.సి లను అభివృద్ధి చేయడానికి ఓ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ప్రాథమికంగా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ నందు ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించారు. ది. 16-10-22న జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదించారు. ఈ సందర్భంగా ఖమ్మం డిసిసిబి కార్యాలయానికి వచ్చిన నెదర్లాండ్ డెలిగేట్స్ ను డిసిసిబి డైరెక్టర్ “చావా వేణు” సన్మానించారు.
ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ చావా వేణు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్యాక్స్ మరియు ఎఫ్.సి.పి లు ఇన్ పుట్ (విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ ఉత్పత్తులు) సేకరణ మరియు మార్కెటింగ్ చేయుటకు నిర్దిష్ట వాతావరణ సలహాలను ఇచ్చుటకు మరియు ఇతర సేవల కొరకు ఉపయోగపడుతుందన్నారు. ఇన్ పుట్ క్రెడిట్, లాజిస్టిక్స్ మరియు ఇన్సూరెన్స్ పథకాలను పొందుటలో తెలంగాణ రైతులకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేయుటకు మరియు వాటి యొక్క విలువలను పెంచడం, రైతుల యొక్క నికర ఆదాయాన్ని పెంచడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ద్వారా బ్యాంకులకు కలిగే రిస్కును తగ్గించుటకు మరియు సకాలంలో చెల్లింపులను చేయుట జరుగుతుందన్నారు