Friday, 6 November 2026

యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ లో రక్తదాన శిబిరం

యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ లో రక్తదాన శిబిరం

జహీరాబాద్ డిసెంబర్ 9 ( జనం సాక్షి) జహీరాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య శ్రీ పాలి క్లినిక్ అండ్ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ లో శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో జహీరాబాద్ లోని హెచ్ డి ఎఫ్ బ్యాంకు మేనేజర్, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. శిబిరాన్ని డయాగ్నొస్టిక్ సెంటర్ యజమాన్యం నిర్వాహకులు ఈశ్వర్ పాటిల్, మహిపాల్, హెచ్ డి ఎఫ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశం, ఆర్ ఎం రంజిత్ అగ్రే లు ప్రారంభించారు. శిబిరంలో హెచ్ డి ఎఫ్ సిబ్బంది దత్తగిరి కాలోని మరియు వివిధ వార్డు లలోని ప్రజలు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలోహెచ్ డి ఎఫ్ సిబ్బంది చైతన్య ప్రక్షాష్,చంద్ర శేఖర్, రాకేష్,సుధాకర్ రెడ్డి డయాగ్నొస్టిక్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.