* ఎమ్మెల్యే హరిప్రియ నాయకత్వాన కదిలిన సులానగర్ గ్రామస్తులు
టేకులపల్లి, జనవరి 17( జనం సాక్షి): ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం సులానగర్ గ్రామ పంచాయతీకి చెందిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ అభిమానులు సుమారు 150 మంది యువకులు ఖమ్మంలో 18న జరిగే బి ఆర్ ఎస్ భారీ బహిరంగ సభకు మంగళవారం డీజే పాటలతో ఎంతో ఉత్సాహంగా పాదయాత్రతో బయలుదేరారు.
ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఖమ్మం లో జరగబోయే భారీ బహిరంగ సభకు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ వాహనాల్లో తరలి రావాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఎమ్మెల్యే అభిమానులు పాదయాత్ర చేసుకుంటూ ఖమ్మం సభకు బయలుదేరి వారి అభిమానాన్ని చాటుకున్నారు. సులానగర్లోని ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారిలోఎస్సీ కాలనీ నుండి పాదయాత్రగా బయలుదేరగా స్థానికు ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య, లక్కినేని శ్యామ్ పార్టీ జెండాను ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రను టేకులపల్లి మీదుగా ఇల్లందు పట్టణం చేరుకొని ఖమ్మం బహిరంగ సభ వరకు కొనసాగుతుందని ఎమ్మెల్యే హరిప్రియ అభిమానులు తెలిపారు. బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు,ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామపంచాయతీ నందు అద్భుతంగా జరిగాయని అందుకు ప్రతిఫలంగా ఈ యొక్క పాదయాత్ర ద్వారా ఖమ్మం సభకు తరలి వెళ్లాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ పాదయాత్రలో బోడ రమేష్ నాయక్, కుమ్మరి గురవయ్య, కుమ్మరి కిరణ్, కుమ్మరి చౌదరి, గుగులోతు బద్రు నాయక్, బల్లెం బిక్షం, బల్లెం చిట్టిబాబు, బల్లెం సుధాకర్, డాక్టర్ రాజు,కొప్పుల సురేష్ తదితరులు ఉన్నారు.




