ఖమ్మం లో18 న జరిగే బి ఆర్ ఎస్ పార్టీ బహిరంగ సభ ను విజయవంతం చేయా లి – సండ్ర
పెనుబల్లి, జనవరి 22(జనం సాక్షి)
ఖమ్మం జిల్లాలో ఈ నెల 18 న
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరగ బోయే బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ తొలి బహిరంగ సభను విజయ వంతం చేయాలని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు,
పెనుబల్లిలో జరిగిన సన్నాహక సమావేశంలో సండ్ర వెంకట వీరయ్యతో ,నర్సంపేట శాసనసభ్యులు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి పాల్గొ న్నారు, సమావేశం లో ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరు పార్టీకి సేవకులుగా పనిచేసి బిఆర్ఎస్ పార్టీ తొలిసారిగా ఈనెల 18వ తారీఖున ఖమ్మంలో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. బహిరంగ సభ విజయవంతం చేసే దిశగా పార్టీ నాయకత్వం పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.




