స్వామి వివేకానందను యువత స్ఫూర్తి గా తీసుకోవాలి : అఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :స్వామి వివేకానంద బలమే జీవం బలహీనతే మరణం అని చెప్పిన గొప్ప మహానీయులని ,లోక కల్యాణం కోసం నిరంతరం శ్రమించిన స్వామి వివేకానంద సూర్య చంద్రులు ఉన్నంత కాలం అందరి హృదయాలలో పదిలంగా ఉంటారని కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అఫ్జల్ ఖాన్ అన్నారు. గురువారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ స్వామి వివేకానంద 160 వ జయంతి సందర్భంగా జరుపుకునే యువజన దినోత్సవాన్ని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జరుపుకున్నారు . ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు… ఆయన గురువు రామకృష్ణ పరమహంసను కలిశాక ఎన్నో మహాకార్యలు రూపు దాల్చారని అన్నారు. చికాగో లో ఆయన చేసిన తొలి ప్రసంగం ద్వారా యావత్తు ప్రపంచంలో భారత దేశ ఖ్యాతి ని పెంచ గలిగారని , ఆయన యువత కోసం పాటు పడి ఇచ్చే సందేశం , ఆయన సూక్తులు ఎన్నో అద్భుతాలు చేసిందని ,బలోపేత మైన భారతం గా రూపు దిద్దటంలో దోహదపడిందని అఫ్జల్ ఖాన్ తెలిపారు. స్వామి వివేకానంద జీవితం ప్రతి ఒక్కరికి స్పుర్తిదాయకమని, యువతరం, ప్రతి ఒక్కరు ఆయన ఆదర్శాలను అనుసరించి భారత దేశ ప్రతిష్టను మరింత గా ఇనుమడింప జేయాలని అఫ్జల్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, మురళి వజ్జల , కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్ , మేడ్చల్ జిల్లా కేసిఆర్ సేవాదళం కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, నాయకులు బత్తుల శశికాంత్ యాదవ్,యాష్కి శోభన్ తదితరులు పాల్గొన్నారు.
12ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు
స్వామి వివేకానందను యువత స్ఫూర్తి గా తీసుకోవాలి




