హుజూర్ నగర్ ఫిబ్రవరి 8 (జనంసాక్షి): హుజూర్ నగర్ పరిధిలోని శ్రీ సీతారామచంద్రస్వామి గట్టు వద్ద జాతరలో చివరి రోజు బుధవారం ధోపు మహోత్సవంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతిరెడ్డి పద్మ రాంరెడ్డి, కౌన్సిలర్ లు జక్కుల శంబయ్య, గుండా ఫణి కుమారి రామ్ రెడ్డి, పట్టణ యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, మహిళా నాయకురాలు గూడపు దీప, బి ఆర్ ఎస్ నాయకులు లక్కం వెంకన్న, యువజన నాయకులు జడ అంజి, కోలపూడి చంటి, పంగా నర్సింహరావు జనిగ వినయ్, దగడు గోపి, కస్తాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




