Tuesday, 3 November 2026

ఖాదీ, హ్యాండ్లూమ్‌లపై జిఎస్టీ

ఇదేనా విూ గాంధీ విధానం అంటూ కెటిఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌,అగస్టు2 ( జనంసాక్షి ) : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా మరోమారు విమర్శలు గుప్పించారు. ఆత్మనిర్భారత్‌కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించారు. ప్రధాని మోదీనేమో.. భారత్‌కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్‌ ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధానిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఇదేనా విూ ఆత్మనిర్భర్‌ భారత్‌..? విూరు చెప్పే వోకల్‌ 4 లోకల్‌ ఇదేనా అని కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.

““““`