ఖానాపూర్ రూరల్ మే 4 (జనం సాక్షి): ప్రతిపక్షాల ను ఎదుర్కొ లేకనే ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని ఖానాపూర్ అభివృద్ధి కి ఇచ్చిన మాట తప్పిన కెసిఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని ప్రతిపక్ష పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ,బీజేపీ,వై ఎస్ ఆర్ సిపి ,రైతు కూలి సంఘ నాయకులు అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ నియోజకవర్గ సమస్యలు తెలుపుతాము అనే విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి కి రాత్రి ఇంటి వద్ద నే అరెస్ట్ చేయడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల ను ఎదుర్కునే దమ్ములేద అని ప్రతిపక్ష నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గ కు వచ్చినపుడు ఖానాపూర్ డివిజన్ ఏర్పాటు, సదర్మాట్ బ్యారేజి,ఏరియా హాస్పిటల్ పనులు కుర్చీ వేసుకొని పనులు చూపిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్లీ జిల్లా కు వస్తున్న నేపథ్యంలో వారికి సమస్యలను ప్రతిపక్ష పార్టీ నాయకులు గుర్తుచేస్తామని అడిగిన పాపానికి ఈరోజు అక్రమ అరెస్టు లు చేయడం సరి కాదు అని ప్రతిపక్ష నాయకులు మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధోనికేని దాయనంద్,మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం,జనరల్ సెక్రటరీ షబ్బీర్ పాషా,పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేష్,తోట సత్యం,మడిగేలా గంగాధర్,సలీమ్ ఖాన్,బీజేపీ జిల్లా నాయకులు పడాల రాజశేఖర్,పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్,తోకల బుచ్చన్న,రైతు కూలి సంఘ నాయకులు నంది రామయ్యా,పుప్పాల ఉపేందర్,వై ఎస్ ఆర్ సి పి నాయకులు లోకిని రాము,చిలుకూరి మురళి,పీటర్,నాగేల్లి నర్సయ్య ఉన్నారు.




