Tuesday, 3 November 2026

పేదింటి పెళ్ళికి ఆర్థికసాయం.

బెల్లంపల్లి, జూన్ 4, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జక్కుల అశోక్ గౌడ్ పుష్పలత కూతురు వివాహానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, గొల్లపల్లి ఎంపీటీసీ సభ్యుడు బొమ్మెన హరీష్ గౌడ్, మరియు అతడి కుటుంబ సభ్యుల పరివారం అంతా కలిసి రూ. 25 వేల రూపాయల నగదు అందజేశారు. ఈకార్యక్రమంలో బొమ్మెన పరివార్ సభ్యులు మాజీ ఎంపీపీ బొమ్మెన శ్రీమతి, బొమ్మెన సత్యనారాయణ గౌడ్, బొమ్మెన పరివారం పాల్గొన్నారు.