*ఖానాపూర్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రజా పంథా ఆధ్వర్యంలో కలెక్టర్కు మెమోరండం ప్రజా సమస్యలను కలెక్టర్కు వివరిస్తున్న ప్రజా పంథా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య*

పోడు భూములకు పట్టాలు ఇవ్వా లని ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను పేదలకు పంపిణీ చేయాలని అర్హులందరికీ ఆసరా పెన్షన్ లు ఇవ్వాలని సొంత స్థలం  ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఆర్థిక సహకారం అందించాలని నూతనంగా రేషన్ కార్డులు అందజేయాలని పోడు సాగు దారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు బెదిరింపులు కేసులు ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఐబి నుండి amk ఫంక్షన్ హాల్ వరకు ఊరేగింపు నిర్వహించి ఖానాపూర్ లో ప్రజా ఫిర్యాదుల విభాగానికి విచ్చేసిన కలెక్టర్ కి డిమాండ్లతో కూడిన మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య ఏ ఐ కె ఎమ్ ఎస్ ఖానాపూర్ మండల అధ్యక్షులు మడావి అంకుష్ రావు మండల నాయకులు జక్కుల రాజన్న వర్మ గోరే బాయ్ మున్వర్ ఆర్మూర్ రాజన్న మచ్చ శ్రీనివాస్ రవి గంగారాం విద్య అక్క కొమరం మంతు పూసం గోపాల్ లక్ష్మణ్ సుగ్గు భీమ్రావు సోనీ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ గారి తో ప్రజా సమస్య లు పరిష్కరించాలని నంది రామయ్య మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు