Thursday, 5 November 2026

ఖేలో ఇండియా విజేత” సాహితి కీ ఘన సన్మానం

 

రఘునాథ పాలెం మార్చి 11(జనం సాక్షి)
ఖమ్మం పట్టణానికి చెందిన సాహితి ఇటీవల జాతీయ స్థాయి ఖేలో వెయిట్ లిఫ్టింగ్ టోర్నిలో కాంస్య పథకం సాధించి తెలంగాణా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.

ఈ నేపథ్యంలో ఖమ్మం పట్టణం లో గల దుర్గ విరించి హాస్పిటల్, పే బ్యాక్ టు సొసైటీ, సవ్వడి మొబైల్స్, సయుక్తoగా “సాహితీ” కీ దుర్గా విరించి మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ప్రాoగణం లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వేముల సాహితీ తో పాటు తల్లి దండ్రులు రంగారావు సైదమ్మ లను కూడా శాలువా కప్పి సన్మానం చేసారు. సాహితీ కీ పదహారు వేల రు ల (డా కిరణ్ కుమార్ 5000/- కే దుర్గాప్రసాద్ కలెక్టరేట్ ఉద్యోగి 5000/- పే బ్యాక్ టు సొసైటీ సభ్యుల తరపున 6000/-) సహాయాన్ని అందించారు. ఈ సందర్బంగా వక్తలు బి సి సంగం అధ్యక్షులు లిక్కి కృష్ణారావు యాదవ్ , గుంతేటి వీరభద్రం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ జిల్లా సభ్యులు, డా కిరణ్ కుమార్, సొసైటీ స్థాపకులు జంగం లక్ష్మణ్ రావు & జైపాల్, ప్రకాష్ లు మాట్లడుతూ వేముల సాహితీ పేద బి సి కుటుంబం నుండి వచ్చింది అని, తండ్రి ఎలక్ట్రికల్ రిపేర్ లు చేస్తూ కూతుర్ని జాతీయ స్థాయి ప్లేయర్ గా తీర్చి దిద్దారని కొనియాడారు. ప్రభుత్వం,స్వచ్చందం సంస్థలు మరింత చేయూత నిస్తూ ఎక్కువగా చొరవ చుపి ఆర్థికంగా సహాయం చేసి తోడ్పాటునందిస్తే, తెలంగాణా రాష్ట్రానికి, ఇండియాకీ అంతర్జాతీయ స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పథకం సాధించి రాష్ట్రానికి, దేశానికీ వన్నె తెచ్చి గర్వoగా నిలుస్తుందని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జమ్మి జైపాల్, సవ్వడి మొబైల్స్ పిరంగి శ్రీనివాస్ (వాసు ), వల్లెపు సోమరాజు, పి రమ్య, పిరంగి రామదాసు, మద్దెల విజయ్, వి రాజు, సాయిబాబు, డి శ్రీనివాస్, అడ్వకేట్స్ కే శ్రీనివాస్ & విజయ్, ఏంటీ ప్రకాష్, బాబు వెంకటేశ్వర్లు,రమేష్ బాలస్వామి, ప్రభాకర్, కుటుంబరావు, చిహెచ్ శ్రీకాంత్ మరియు ఖమ్మం దుర్గ విరించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది జానీ, రేష్మా, కళ్యాణ్, రవి, విజిత, వరుణ్, గీతాంజలి తదితరులు సన్మాన కార్యక్రమంలో పాలొన్నారు.