గంగారం ఎంపీటీసీ పూనెం భద్రమ్మ ప్రభాకరన్న కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
గంగారం జులై 10 (జనం సాక్షి) గంగారం మండలం పందెం గ్రామములోని గంగారం మండల ఎంపీటీసీ పూనెం భద్రమ్మ ప్రభాకరన్న కుమారుడు కోటేశ్వరరావు అనారోగ్యంతో మరణించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారం కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, గంగారం ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు, జడ్పీటీసీ ఈసం రమ సురేష్, వైస్ ఎంపీపీ ముడిగా వీరభద్ర పోతయ్య, మడగూడెం సర్పంచు చుంచ వెంకటలక్ష్మి మహేందర్, మాజీ సర్పంచు యాప భద్రక్క, వజ్జ నర్సయ్య పెద్దకర్మ కు హాజరై పూనెం కోటేశ్వరరావు చిత్రపటానకి పూల మాలవేసి నివాళ్లు అర్పించి ప్రగాడ సంతాపని సానుభూతి ని తీయజేసినారు. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పూనెం భద్రమ్మ ప్రభాకరన్న కుటుంబని పరామర్శించి, ఎంపీటీసీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గంగారం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.