ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోబి ఆర్ఎస్ పార్టీతిరుగులేని శక్తిగా ఎదుగుతుంది-ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఆకర్షితులై రోజు రోజుకు బి ఆర్ఎస్ పార్టీ బలం పుంజుకొని తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు సోమవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండల పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ సమక్షంలో కోట్ పల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అనంతయ్య, యాదగిరి, జ్ఞానేశ్వర్, రాహుల్, ప్రేమ్ కుమార్ వారి అనుచరులు 20 మంది BRS పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య యాదవ్ మండల రైతు బంధు అధ్యక్షుడు సత్యం డాడీ మండలంలోని సర్పంచులు ఎంపిటిసి సభ్యులు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.