Thursday, 5 November 2026

వ్యవసాయ అధికారిపై సొసైటీ చైర్మన్లు గరం.

జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మంజుల కాశీనాథ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎంపీడీవో గణేష్ రెడ్డి తోపాటు మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను సమావేశంలో చర్చించారు సర్పంచ్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని వెంటనే బిల్లును చెల్లించాలని సర్పంచులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్ మాట్లాడుతూ గ్రామాలలో వర్షాకాలం సీజన్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు, వచ్చే వర్షాకాలం సీజన్లో పండించే వ్యవసాయ పంటలపై వ్యవసాయ అధికారులు రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు మరోవైపు మండల వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్టీ లేజర్ షాపులకు ఎలాంటి అనుభవం లేని వారికి, అర్హత లేని వారికి అనుమతి మంజూరు చేస్తున్నారని మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి పై సొసైటీ చైర్మన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ మంజుల కాశీనాథ్, ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఎమ్మార్వో చంద్రశేఖర్, ఎంపీఓ కృష్ణవేణి, వ్యవసాయ అధికారి శ్వేత కుమారి, సర్పంచ్ గోదావరి, రంగంపేట సర్పంచ్ సుజాత రమేష్, సొసైటీ చైర్మన్ లు ప్రభాకర్ ,మనోహర్, మల్లేశం గౌడ్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు