గద్వాల ఆర్ సి. ఏప్రిల్ 19,(జనం సాక్షి). ఈ రోజు డికె. బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మైనార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహిద్ ఖాన్,పట్టణ మైనార్టీ అధ్యక్షుడు అసిఫ్ మాట్లాడుతూ డి.కె.కుటుంబం గద్వాలలో ఉన్న మైనార్టీ లతో ఉన్న కుటుం బపరమైన సాన్నిహిత్యం గురించి నీవంటి కిరాయి రాజకీయ నాయకులకు తెలియదు.గద్వాలలో ఏనాడు కుల,మత, విభేదాలు లేకుండా అందరం కలిసి మెలిసి జీవించే స్వచ్ఛమైన నాయకత్వం డి.కె.కుటుంబం వల్లే ఉంది.MIM నాయకులు అవగాహనా రాహిత్యం వల్ల మూర్ఖంగా మాట్లాడి ముస్లింల ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తున్నారు. నీలాంటి మూర్ఖులు,స్వార్థ పరుల వల్లే విష బీజాలు పడుతున్నాయి నీవంటి కిరాయి మనుషులకు కూడా జవాబు చెప్పాల్సిన దౌర్భాగ్యం కలిగినందుకు సిగ్గుపడాల్సిన స్థితి ఏర్పడింది.నీ వ్యక్తిగత స్వార్థం కోసం ఇస్లాం ను, రాజకీయాలను వాడుకుంటే ,అబద్ధపు ఆరోపణలు చేస్తే నీకుపరాభవం తప్పదు.నీ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు రక్షణ కోసం అధికార పార్టీ గులాంగా మారి మైనార్టీ లకు జరుగుతున్న అన్యాయాలను అడగలేని నీవంటి కిరాయి నాయకుల వల్ల మైనార్టీలకు మోసం జరుగుతూ ఉంది.బడుగు మైనార్టీలకు ఎందరికో డి.కె.అరుణమ్మ ఎంతో వ్యయ ప్రయాసలతో సాధించి ఇచ్చిన ఇళ్ల స్థలాలను అధికార బీ.ఆర్.ఎస్ పార్టీ గుంజుకొంటే నీవు ఎక్కడికి పోయావు. కేసీఆర్ స్వయంగా గద్వాలలో ఇచ్చిన మైనార్టీ లకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే హామీ గాలికి వదిలివేసినా ఏనాడైనా ఆడిగావా.కేసీఆర్ ఇచ్చిన గద్వాలలో ఈద్గా అభివృద్ధి హామీ ఏమైంది అని ఆడిగారా.బ్యాంక్ లతో సంభందం లేకుండా మైనార్టీల కు ప్రత్యేక నిధుల ద్వారా ఇస్తామని కేసీఆర్ స్వయంగా ఇచ్చిన హామీ ఏమైంది అని ఏనాడైనా అడిగారా.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మైనార్టీల కు అందిన సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా ఆడిగారా ఏదో పెద్ద దానం చేసినట్టు నాసిరకం బట్టలు ఏదో 20 శాతం మందికి ఇచ్చి అదే మైనార్టీ సంక్షేమమని నోరు విప్పలేని కిరాయి నాయకత్వం మాకు తెలుసని అన్నారు.మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకుందాం. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అడుగు జాడల్లో నడుద్దాం.




