Saturday, 7 November 2026

గంటల వ్యవధిలో భీమా డబ్బులు చెల్లింపు

గంటల వ్యవధిలో భీమా డబ్బులు చెల్లింపు

సకాలంలో ప్రీమియం చెల్లించండి ఆర్థిక భద్రత పొందండి:ఎస్బిఎం వెంకటేశ్వర్లు

డిసెంబర్20

దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన గువ్వ అయిలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా మంగళవారం బీమా మొత్తాన్ని మృతురాలి భర్త గువ్వ వీరయ్య (నామిని)కు 80 వేల 250 రూపాయలు కేవలం గంటల వ్యవధిలో చెల్లించినట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి ) మహబూబాబాద్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కోటపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..జీవిత బీమా రంగంలో ఏకైక ప్రభుత్వ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి)అని అన్నారు. అత్యంత వేగంగా భీమా మొత్తాలను సెటిల్ చేస్తూ నమ్మకానికి మారుపేరుగా నిలిచిందని అన్నారు.సకాలంలో రెన్యువల్ ప్రీమియం చెల్లిస్తే మరింత ఆర్థిక భద్రత లభిస్తుందన్నారు. కేవలం గంటల వ్యవధిలో భీమా మొత్తాన్ని సెటిల్ చేసిన అధికారులు హనుమంతు బాబు,మంగ్యా నాయక్ లను, అందుకు చొరవ చూపిన అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, డెవలప్ మెంట్ ఆఫీసర్ ధరావత్ శంకర్, ఏజెంట్ బాణాల బిక్షపతి లను అభినందించారు