పెండింగ్ స్కాలర్షిప్స్ , కాస్మోటిక్స్ ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు విడుదల చేయాలి
* పి డి యస్ యూ డిమాండ్
టేకులపల్లి, డిసెంబర్ 20 (జనం సాక్షి ): గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ 3500 కోట్ల రూపాయలను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శీ కాంపాటి పృధ్వీ అన్నారు. మంగళవారం విద్యార్థులకు స్కాలర్షిప్ లతోపాటు కాస్మోటిక్ ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని విద్యార్థులు కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ ఎనిమిదేళ్ల పాలనలో ప్రభుత్వ విద్యను విస్మరిస్తూ కేజీ టు పిజీ ఉచిత విద్యా విధానం పేరుతో నూతన గురుకులాలను ప్రవేశపెట్టి, వాటికి దిశా నిర్దేశం లేకుండా సరిపడా ఉపాధ్యాయులను,నూతన భవనాలను కేటాయించకుండా అద్ధె భవనాలలో కొనసాగిస్తూ లక్షల రూపాయల అద్దెను చెల్లిస్తూ కాలం వెలుబుచ్చుతున్నారని, తక్షణమే అన్ని రకాల వసతి గృహ విద్యార్థులకు నూతన భవనాలు ఏర్పాటు చేయాల్సిన కర్తవ్యాన్ని ప్రభుత్వం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్న నేపథ్యంలో వసతి గృహ విద్యార్థులకు ప్రస్తుతం అతి తక్కువ మెనూ అమలు చేస్తున్నారని దీని మూలంగా భోజనం నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు వాంతులు,విరోచనాలు కడుపులో నొప్పి లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తక్షణమే ధరలు కనుగొనంగా మిస్ చార్జీ పెంచి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ కాస్మోటిక్ ధరలకు అనుగుణంగా మెస్ చార్జీల పెంపుదలపై డిసెంబర్ 21వ తారీఖున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి డి �




