బీఆరెస్ అధికార ప్రతినిధిగా యాదగిరి.
ఫొటో : నియామక పత్రం అందుకుంటున్న యాదగిరి.
బెల్లంపల్లి, డిసెంబర్ 20, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణ బీఆరెస్ పార్టీ అధికార ప్రతినిధిగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాసర్ల యాదగిరి నియమితులయ్యారు. మంగళవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈసందర్భంగా యాదగిరి మాట్లాడుతూ బీఆరెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో పదవి అందించిన పార్టీ అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నూనేటి సత్యనారాయణ, సదానందం, గోలి శివ పాల్గొన్నారు.
బీఆరెస్ అధికార ప్రతినిధిగా యాదగిరి




