Friday, 6 November 2026

గజ్వేల్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

– అందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధం

– పోలీస్‌ వ్యవస్థ కేసీఆర్‌ కుటుంబానికి అనుకూలంగా పని చేస్తోంది

– ప్రతి గ్రామంలో టెంట్లు వేసి మద్యం పంపిణీ చేస్తున్నారు

– మహాకూటమి గజ్వేల్‌ అభ్యర్ధి వంటేరు ప్రతాప్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌27(జ‌నంసాక్షి) : గజ్వేల్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అందుకు తాను ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమని కాంగ్రెస్‌ నేత, గజ్వేల్‌ మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌ రెడ్డి అన్నారు. తన ఇంట్లో పోలీసుల సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన గజ్వేల్‌లో కోడ్‌ ఉల్లంఘన జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విూట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో విూడియాతో మాట్లాడిన వంటేరు కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు. కేసీఆర్‌ అల్లుడు 15రోజులుగా గజ్వేల్‌లో తిష్ట వేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇష్టా రాజ్యాంగ, నాఇంట్లో సోదాలు చేశారని, ఇంట్లో సామాను అంతా చిందర వందరంగా పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో పోలీస్‌ లేదు, చట్టం లేదు, విచ్చల విడిగా మద్యం పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడ వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. గత నాలుగున్నరేళ్లలో తనపై 23కేసులను కేసీఆర్‌ పెట్టించారని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే ఫైరింగ్‌ చేయడమే కాకుండా, 42 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. ఆమధ్య ఇద్దరు ఎస్సైలు సూసైడ్‌ చేసుకున్నార వార్తలొస్తే, అవి సూసైడ్‌ లు కాదని హత్యలని తాను అన్నందుకు వాటిపై కూడా కేసులు పెట్టారని చెప్పారు. ఇలాంటి ఎన్నో దారుణాలు జరిగాయని ప్రతాప్రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలోని పోలీస్‌ వ్యవస్థ కేసీఆర్‌ ఫ్యామిలీకి అనుకూలంగా పని చేస్తోందని ఒంటేరు ఆరోపించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో గత 45 రోజులుగా హరీష్‌ రావు ప్రతి గ్రామంలో టెంట్లు వేసి మద్యం పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీడియోలు చూపించినా పట్టించుకోలేదని చెప్పారు. ఈ అన్యాయాలను నిరసిస్తూ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట తాను నిరాహారదీక్షకు దిగితే, పోలీసులు తీసుకెళ్లి స్టేషన్‌ లో పెట్టారని మండిపడ్డారు. తననివాసంలో సోదాలు చేస్తున్నామంటూ ఇల్లంతా చిందరవందర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ విూదే పోటీ చేస్తావురా? ఎంత ధైర్యంరా నీకు? నీ వెనుక ఎవరున్నార్రా? అంటూ భయానక వాతావరణం సృష్టించారని అన్నారు. తన ఫోన్‌ ను కేసీఆర్‌ ప్రతిరోజు ట్యాప్‌ చేస్తున్నారని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులలో వచ్చిన కమిషన్లను ఎన్నికల్లో వెదజల్లుతున్నారని ప్రతాప్‌ రెడ్డి ఆరోపించారు. ఆలీబాబా 40దొంగలు వచ్చినట్లు రోజుకో వ్యక్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడని, నాపై పోటీ చేసే ధైర్యం లేక అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్నారు.. నా దగ్గర డబ్బుల్లేవ్‌. ప్రజల కాళ్లు పట్టుకుని ఓట్లు అడుగుతున్నా అంటూ ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.