Thursday, 5 November 2026

గడపగడపకు కాంగ్రెస్

గడపగడపకు కాంగ్రెస్
అశ్వరావుపేట ఆర్సి జనవరి 13 (జనంసాక్షి)
అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలంలోని
మామిళ్ల వారి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలు మరియు గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలను అసరా పేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోతు దంజు నాయక్ ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఉన్నటువంటి అంశాలు మరియు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు జరిగిన అభివృద్ధి మరియు పోడు భూములు పట్టాలి ఇవ్వడం సన్న చిన్న కార్ రైతులను ఆదుకోవడం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కాంగ్రెస్ పార్టీలో మధ్యతరగతి బీద వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాజంలో ముందుకెళ్లారని అంతేకాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీది అందివేసిన చేయగా ప్రజలందరూ గుర్తించారని తద్వారా ఇందిరమ్మ రాజ్యం రానున్న రోజుల్లో వస్తుందని తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మొగళ్ళపు చెన్నకేశవరావు ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పేటేటి నరసింహ రావు జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బూసి పాండురంగ కాంగ్రెస్ పార్టీ ఓ బి సి అధ్యక్షులు బండారు మహేష్ వేముల ప్రతాప్ గండికోట రాంబాబు శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు