Thursday, 5 November 2026

టీఆర్టీఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి

టీఆర్టీఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి , అభివృద్ధికై నిరంతరం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు గులాం జహంగీర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ , జిల్లా గౌరవ అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి , నాయకులు ఎక్బాల్ అహ్మద్ , ప్రదీప్ , ఉపేందర్ రెడ్డి , గురవయ్య , ఎల్లా గౌడ్ , వీరారెడ్డి ,శ్రీనివాసరావు , శ్రీనివాసులు , జమాల్ , గౌస్ తదితరులు పాల్గొన్నారు.