జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి మండల అధ్యక్షుడు జంగపల్లి అజయ్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పాలన 9 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మహాజన సంపర్క అభియాన్ పేరుతో నెల రోజుల కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది మరియు గ్రామాల వారీగా, శక్తి కేంద్రాల వారిగా పోలింగ్ బూతుల వారిగా ఇన్చార్జిల నియామకం జరిగింది. ఈ నెల రోజులు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 9 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ప్రతి గడప గడపకు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన చాలా మంచి పనులను వివరించాలని అలాగే ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అతికించి మోడీ చేసిన పనులను కరపత్ర రూపంలో పంచి పెట్టాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు గుండా బోయిన లక్ష్మణ్ యాదవ్ వచ్చారు. అలాగే స్వతంత్ర వీర సావర్కర్ జయంతిని ఘనంగా జరపడం జరిగింది. వీర సావర్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మట్ట శంకర్, మచ్చ గిరి రాము, పెద్దపల్లి జిల్లా బిజెపి దళిత మోర్చా నాయకులు ఇరుగురాల పోచం, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మల్లారపు అరుణ్ కుమార్, బర్ల సదానందం, కొయ్యడ సతీష్, మేదరి లింగస్వామి,దండే రమేష్, మట్ట రాజయ్య,కొమ్ము శ్రీనివాస్, జంగపెల్లి శేఖర్, బండి రాయలింగు, చిగురు రవితేజ, గోపాల సతీష్, ఇరు గురాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలి




