జనంసాక్షి, మంథని : రాష్ట్రంలో నిరుపేద బ్రాహ్మణుల సంక్షేమం కొరకు బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ కోఆర్డినేటర్ కాలేశ్వరం దేవస్థానం మాజీ కార్యవర్గ సభ్యుడు రామడుగు మారుతి కొనియాడారు. ఆదివారం స్థానిక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ సమీపంలో ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులకు చేయూతను అందించలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గాఢాంధకారంలో ఉన్న బ్రాహ్మణులకు ఆశాకిరణంగా నిలిచాడని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులైన బ్రాహ్మణ యువకులకు స్వయం ఉపాధి పథకం, విద్యార్థులకు స్కాలర్షిప్, వేద పండితులకు వేతనాలు, దేవాలయాల్లోని పూజారులకు వేతనాలు అందిస్తూ బ్రాహ్మణులను ఆదరిస్తున్న కేసీఆర్ కు ఆయనే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బ్రాహ్మణ సంఘ నాయకుడు తనుగుల రాజన్న మాట్లాడుతూ బ్రాహ్మణులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మనమందరం బలపరచాలని ఆయన కోరారు. అలాగే ఈ నెల 31న హైదరాబాదులో సీఎం కేసీఆర్ ప్రారంభించబోయే బ్రాహ్మణ భవన్ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయ పాలకమండలి వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు మేడగోని రాజమౌళి గౌడ్, శ్రీ మహాలక్ష్మి దేవాలయ కమిటీ అధ్యక్షురాలు మారుపాక చంద్రకళ-రమేష్, కొండేల మారుతి, మారుపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే – రామడుగు మారుతి




