Wednesday, 4 November 2026

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం స్థానిక విద్యా భారతి ఉన్నత పాఠశాల 1998-99 పదవ తరగతి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆదివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి 24 ఏళ్లు అవుతున్నా.. గత స్మృతులను గుర్తుంచుకొని పాఠశాలలో సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో, వివిధ వృత్తులలో స్థిరపడిన పూర్వ విద్యార్ధులు తమ గత స్తృతులను నెమరువేసుకున్నారు. తమ వయస్సును మరిచి నృత్యాలు చేశారు. పాటలు పాడారు. తాము చదువుకున్న పాఠశాలలో కలియతిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ కుటుంబ నేపథ్యాలను, కష్టసుఖాలను పంచుకున్నారు. పూర్వ విద్యార్థులలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులలో ఉన్న మిత్రులకు సహాయసహకారాలను అందించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా కల్వచర్ల గ్రామ సర్పంచ్ గంట పద్మ వెంకట రమణారెడ్డి, విద్యా భారతి పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్, టీచర్స్ శ్రీధర్, శ్యాంసుందర్, కుమారస్వామి, కాళీ చరణ్, లను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వెంకటేష్, వీరవెన రమేష్, సత్యప్రసాద్, లక్ష్మణ్, శైలజ, నీలిమ, శ్యామలతో పాటు 24 మంది విద్యార్థులు పాల్గొన్నారు.