Thursday, 5 November 2026

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రికెట్ పోటీలు

మెట్పల్లి టౌన్, జనవరి 22,
జనంసాక్షి :
మెట్టుపల్లి పట్టణ కేంద్రంలో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికల్ అసోసియేషన్ సభ్యులు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు రెండు జట్లుగా ఏర్పడి క్రికెట్ మ్యాచ్ పోటీల్లో పాల్గొనడం జరిగింది. చిరంజీవి జట్టు విన్నర్ ప్రథమ స్థానం విజేతగా, రెండో స్థానంలో చిలువేరి శ్రీనివాస్ జట్టు రన్నరప్ గా విజయం సాధించారు,
విజేతలకు మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కప్ మెమొంటో లు అందజేస్తామని అసోసియేషన్ అధ్యక్షులు గాజంగి సుదర్శన్ అన్నారు, అలాగే మానసిక ఉల్లాసం కొరకు ఎప్పుడు వ్యాపారంలో ఉంటూ మానసిక ఒత్తిడిలో ఉంటూ వ్యాపారంలో తలమునకలై ఉండడం వల్ల ఒత్తిడికి లోనై ఉండడం వ్యాపారస్తుడికి సహజం అందుకే
మెడికల్ అసోసియేషన్ ద్వారా అసోసియేషన్ సభ్యుల ఉల్లాసం మరియు మానసిక ప్రశాంతత కోసం మొదటిసారిగా గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు ,
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాజంగి సుదర్శన్ ,ప్రధాన కార్యదర్శి బంగారి విజయ్, బెజ్జరపు శ్రీనివాస్,కృష్ణ ,క్యాషియర్ చిలువేరి శ్రీనివాస్ ,కొండూరి రాజు, సామర్ల గోవర్ధన్, చిరంజీవి, మనోహర్ ,రవి, రాజు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు