నోచుకోలేదువీణవంక మండల కేంద్రంలో అభివృద్ధి నోచుకోలేదు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక జనవరి 22 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా ఉన్న అభివృద్ధి జరగలేదని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వారు మాట్లాడుతూ ఇకనుండి అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఆదివారం వీణవంక మండల కేంద్రంలో స్థానిక లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో వీణవంక గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సహకారంతో వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామ ఇరవై మోరిలనుండి వీణవంక స్థానిక పోలీస్ స్టేషన్ వరకు 29 కోట్ల 80 లక్షల అభివృద్ధి పనుల నిధుల మంజూరు కావడం జరిగిందని తెలిపారు. మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోనే నెంబర్ వన్ గా చేస్తానని అన్నారు. మండల కేంద్రాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాలే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రోడ్డు విస్తరణలో ఎవరిదైనా.. ఇల్లు తొలగింపు జరుగుతే గ్రామ అభివృద్ధి కోసం కాబట్టి అందరూ సహకరించాలని గ్రామ ప్రజలను కోరారు. . ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి జడ్పిటిసి, మాడ వనమల సాధవరెడ్డి వైస్ ఎంపీపీ, రాయిశెట్టి లత సింగిల్ విండో చైర్మన్, విజయ భాస్కర్ రెడ్డి మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రఘుపాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
వీణవంక మండల కేంద్రంలో అభివృద్ధి




