Thursday, 5 November 2026

గ్రామీణ వైద్యులు నిజమైన ప్రజా సేవకులు గ్రామీణ వైద్యులు నిజమైన ప్రజా సేవకులు 

-ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్(జనం సాక్షి) : ఆర్.ఎం.పి పి.ఎం.పి గ్రామీణ వైద్యులు నిజమైన ప్రజా సేవకులు అని సమాజం పట్ల పేద ప్రజల విషయంలో నిస్వార్ధంగా సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామీణ వైద్యులు గొప్పవారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. హుజురాబాద్ మండల ఆర్ఎంపి పి ఎం పి ల గ్రామీణ వైద్యుల సంఘం సర్వసభ్య సమావేశం పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల ఆర్ఎంపి పిఎంపి నూతన కార్యవర్గ సభ్యులను కౌశిక్ రెడ్డి పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరాయన మాట్లాడుతూ సమాజం పట్ల ఎంతో మక్కువ ఉన్న గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా ముందుండి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. అనంతరం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ జోనల్ ఆర్ఎంపి పిఎంపీల గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధుల సమక్షంలో మండల నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపి పిఎంపీల గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు కాసం రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్న మాధవుని నరసింహారాజు, జోనల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రభాకర్ రెడ్డి, హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు గుడిపాటి సమ్మిరెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ,కొక్కుల రవీందర్, మండల ఆర్ఎంపి పి.ఎం.పి సంఘం అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, కోశాధికారి కమల్ సింగ్ తో పాటు గౌరవ అధ్యక్షుడు సంఘం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.