Wednesday, 4 November 2026

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టిపీసిసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్

 

 

 

 

 

కొండమల్లేపల్లి జనవరి 26 (జనంసాక్షి) న్యూస్ :దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీల్యా నాయక్ గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం బీల్యా నాయక్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజని బారతదేశ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయిన శుభదినం అని బుడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ, బిసి మైనారిటీ లకు సమానమైన హక్కులను కల్పించబడ్డ రోజు అని అన్నారు.ఈ పండుగ అందురూ జరుపుకునే పండుగ అని అన్నారు.ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పిస్థు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజని తెలిపారుఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్త్యా రమేష్ నాయక్, పీసీసీ నాయకులు సీరాజ్ ఖాన్, చందంపేట పిఎసిఎస్ చైర్మైన్ జాల నర్సింహ రేడ్డి, కొండమల్లేపల్లి పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, దేవరకొండపట్టణ అధ్యక్షులు ఎండీ యునుష్ , దేవరకొండ మండల అధ్యక్షుడు లొకసాని శ్రీదర్ రేడ్డి,ముక్కమల్ల వెంకటయ్య,నారాయణణ,గౌరి శంకర్,కేతావత్ రమేష్, హరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా,మండల స్థాయి నాయకులు,యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు హరిలాల్, అంజి రవి,నేహ్రు,చిన్నా తదితరులు పాల్గొన్నారు