టేకులపల్లి, జనవరి 26( జనం సాక్షి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ ఆవిష్కరించి, అనంతరం టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి పలు శుభకార్యాలలో పాల్గొని ఆశీస్సులు అందజేసి, పలు కుటుంబాలను కలిసి పరామర్శలు చేసి తన సానుభూతిని తెలియజేస్తూ వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని పెట్రాంచెలక గ్రామంలో లిఖిత హాసిని- యోక్షితల ఓనీ అలంకరణ వేడుక కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. అదేవిధంగా లచ్చగూడెం గ్రామంలో శిరీష- వెంకటేశ్వర్లుల వివాహ శుభకార్యానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత లచ్చగూడెం గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సర్పంచ్ జోగారాణి కుటుంబ సభ్యులు పాయం చుకమ్మ ను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకొని మనోధర్యం కల్పించారు. దొడ్డ కృష్ణ బాబు- కృష్ణవేణి దంపతుల కుమారుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని వారి స్వగృహానికి వెళ్లి ఓదార్చి అధైర్య పడవద్దు అని మనోధైర్యాన్ని అందించారు. ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, బానోత్ రామా నాయక్, బానోత్ కిషన్ నాయక్, చీమల సత్యనారాయణ, బర్మావత్ శివకృష్ణ నాయక్, కాలే ప్రసాదరావు, బానోతు రవి నాయక్ ,




