Saturday, 7 November 2026

రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు తీవ్ర గాయాలు…
శంకరపట్నం: జనం సాక్షి డిసెంబర్ 22
శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలోని, అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం హోంగార్డుకు తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కరీంనగర్ నుండి కేశవపట్నం మీదుగా, ఘన్ముకుల వెళ్లే టిఎస్ఆర్టిసి అద్దె బస్సు లో కరీంనగర్ పట్టణంలో హోంగార్డుగా విధులు నిర్వహించే మండలములోని ఎరడపల్లి గ్రామానికి చెందిన కనకం సురేష్ విధులు నిర్వహించుకొని బస్సులో స్వగ్రామానికి వస్తుండగా కేశవపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బస్సు కింద పడడంతో రమేష్ కుడికాలు పూర్తిగా నుజ్జునుజు కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో కరీంనగర్ పట్టణానికి తరలించినట్లు తెలిపారు. సమాచారము తెలుసుకున్న కేశవపట్నం పోలీసులు సుధాకర్, కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని రమేష్ ను ఆసుపత్రికి తరలించి అద్దె బస్సులు పోలీస్ స్టేషన్ లో పెట్టినట్లు తెలిపారు.