Sunday, 8 November 2026

గణిత దినోత్సవ, సైన్స్ ఫెయిర్ వేడుకలు

గణిత దినోత్సవ, సైన్స్ ఫెయిర్ వేడుకలు.

జనం సాక్షి ,డిసెంబర్22(భువనగిరి ఆర్. సీ);

భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలోని శ్రీనివాస రామానుజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో గురువారం పాఠశాల 11వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలతో పాటు గణిత దినోత్సవ వేడుకలు సైన్స్ ఫెయిర్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి ఎంఈఓ బి. లక్ష్మీనారాయణ హాజరై సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించి, మాట్లాడారు. నేటి సమాజంలో నవభారత నిర్మాతలు విద్యార్థులని అన్నారు. గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ స్కూల్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ దాసరి శ్రీరాములు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన నైపుణ్యం గల విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా శ్రీనివాస రామానుజన్ స్కూల్ పనిచేస్తుందని తెలిపారు. తరగతి గదిలో విద్యార్థులకు భవిష్యత్తు బావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బొబ్బిలి మన్నెమ్మ, రాములు యాదవ్, స్కూల్ డైరెక్టర్లు పాండాల రాజకుమార్ గౌడ్, దొమ్మాటి శ్రీశైలం, ఉపాధ్యాయులు బి రజినీకాంత్, డి వెంకటేశం, భాస్కర్, పుణ్యవతి, భవాని, ఉపాధ్యాయ బృందం, వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు