సులానగర్ పి హెచ్ సికి రు.10 లక్షలు మంజూరు
* ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రు.10 లక్షలు
* ప్రకటించిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ
టేకులపల్లి, డిసెంబర్ 22( జనం సాక్షి ): విద్య, వైద్యం ఎంతో ప్రధానమైనవి అని సౌకర్యాల లేమిని గుర్తించి మండలంలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పది పది లక్షల రూపాయలను ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరి సింగ్ నాయక్ మంజూరు చేశారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేసిన కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, స్థానిక డాక్టర్ వైద్యశాలలో ఉన్న కొరతను, త్రీఫేస్ కరెంటును, ప్రధాన రహదారి వరకు సిమెంటు రోడ్డును, మంచినీటి బోరును తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి అధికారులతోటి ఎస్టిమేషన్ వేయించాలని 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా కొన్ని సౌకర్యాలు కోసం అధ్యాపకులు విన్నవించారని, అక్కడ కూడా 10 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో స్థానికులు వైద్య బృందం అభినందనలు తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అవుతున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని, ప్రతి మారుమూల ప్రాంతానికి రహదారులు సౌకర్యం జరుగుతుందని, మిగిలిన ఇంకా కొన్ని రహదారులు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు




