గణేశ్ పాడులో ఎంపీ నామ పరామర్శలు
పెనుబల్లి , నవంబర్ 12(జనం సాక్షి) :టీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం పెనుబల్లి మండలం గణేశ్ పాడు గ్రామాన్ని సందర్శించి, లగడపాటి శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ ఇటీవల మృతి చెందారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి, సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.సావిత్రమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని నామ ప్రార్ధించారు. అనంతరం లంకా శేషయ్య బంజర లో ఏరువ నర్సింహారావు కుటుంబాన్ని కూడా పరామర్శించి, సంతాపం తెలిపారు. నర్సింహారావు భార్య కమలమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కనగల వెంకట్రావు, కార్యదర్శి భూక్యా ప్రసాద్, ఎంపీపీ సలహాదారు లక్కినేని వినీత్, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ, ఎంపీటీసీ రావూరి రత్నకుమారి, మండల కో ఆప్షన్ గౌస్,సర్పంచులు గోదా చెన్నారావు, పెనుబల్లి సర్పంచ్ తావు నాయక్ , ముత్తగూడెం సర్పంచ్ టి. నాగదాస్, నాయకులు మోరoపూడి బాబూరావు, చీకటి రామారావు, బెల్లంకొండ చలపతిరావు, కోమటి ప్రసాద్, కె. ప్రభాకర్, శంకర్ రెడ్డి ,నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు,రేగళ్ల కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.




