Wednesday, 4 November 2026

ప్రతి ఒక్కరు పుస్తక పఠనాన్ని

ప్రతి ఒక్కరు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి – ఎమ్మెల్యే సైదిరెడ్డి హుజూర్ నగర్ నవంబర్ 12 (జనం సాక్షి): ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని ప్రియదర్శిని కాలేజీ నందు ఏర్పాటు చేసిన బాలల నవల రాజహంస పుస్తక – ఇద్దరు మాంత్రికులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విచ్చేసి పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చునన్నారు. పుస్తక పఠనం అనేది చాలా ముఖ్యమైనది అన్నారు. సమాజంలో జరిగే మంచి, చెడుల గురించి తెలియజేస్తుందన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండి, చదువులో ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మంచి, చెడులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. టెక్నాలజీ అనేది రోజురోజుకు మారిపోతుందన్నారు. కావున విద్యార్థులు తల్లిదండ్రులకు, కళాశాలకు, ఉన్న ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని కళాశాల కరస్పాండెంట్ పశ్య శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ఎంపీటీసీ వల్లభనేని విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, రచయిత పుప్పాల కృష్ణమూర్తి, వేముల వెంకటేశ్వర్లు, హనుమంతు, జక్కుల వెంకటేశ్వర్లు, కళాశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు