Monday, 2 November 2026

గణేష్ పాడులో ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న సండ్ర

పెనుబల్లి, జూన్ 1(జనం సాక్షి)మండల పరిధిలోని గణేష్ పాడు గ్రామ పంచాయితీలో గురువారం జరిగిన రామాలయం ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య పాల్గొన్నారు, ఈ సందర్భం గా మాజీ సర్పంచ్ గోదా రాములు ఎమ్మెల్యే సండ్ర ను శాలువాతో సన్మానించారు, ఎమ్మెల్యే వెంట మండల టిఆర్ఎస్ పార్టీఅధ్యక్షులు కనగాల వెంకటరావు, సర్పంచ్ గోదా చెన్నారావు,నాయకులు లగడపాటి శ్రీనివాసరావు, చింతలపూడి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.