Tuesday, 3 November 2026

జేత్య తండాలో వైద్య శిబిరం

టేకులపల్లి, జూన్ 1( జనం సాక్షి ): మండలంలోని జేత్యా తండా గ్రామంలో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆదేశానుసారం ఆరోగ్య శిబిరం గురువారం నిర్వహించారు. ఈ గ్రామంలో 46 మందికి రక్త పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించడం జరిగింది. గ్రామంలో ప్రతి ఇల్లు సర్వే చేసి ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, రాబోయే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమలు పెరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భూక్య గంగా దల్ సింగ్ నాయక్, స్థానిక పంచాయతీ కార్యదర్శి కార్తీక్ తో పాటు సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్,వీసంశకుంతల, ఏఎన్ఎంలు రమాకుమారి, వెంకటరమణ, దనసరి రాంబాబు, ఆశా కార్యకర్తలు జ్యోతి,నిర్మల,కళావతి, సునీత, శారద, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.