Thursday, 5 November 2026

గన్నవరం విమానాశ్రయ పరిధిలో నిషేధాజ్ఞలు

విజయవాడ,మే12(జ‌నం సాక్షి):  వీఐపీల రాకపోకలతో పాటు భద్రతా కారణాల రీత్యా గన్నవరం విమానాశ్రయం వద్ద 144 సెక్షన్‌ విధిస్తూ విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి నుంచి 55 రోజుల పాటు గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఆజ్ఞలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. ఐదుగురు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంతో పాటు ఆందోళనలు, నిరసనలు, బైటాయింపు కార్యక్రమాలు గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో నిషేధమని స్పష్టం చేశారు. జూలై 4 తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాల్లోని 250 విూటర్ల పరిధిలో 144 (20) సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. శాంతిభద్రతలతో పాటు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.
——–