గన్ను కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణంనెక్కొండ మండలం, మార్చి 30 (జనం సాక్షి) నెక్కొండ లో ప్రముఖ వ్యాపారవేత్త కీర్తిశేషులు, గన్ను వైకుంఠం, గన్ను జనార్ధన్ లు 90 సంవత్సరాల క్రితం సీతారాముల కళ్యాణం వారి ఇంటి లో జరిపేవారు . గన్ను జనార్ధన్ కాలం చేసిన తర్వాత అతని ఏడుగురు కుమారులు వ్యాపారవేత్తలుగా జనార్ధన్ తదనంతరం అతని కుమారులు వెంకటరమణ పూలమ్మ, రాజారాం రమాదేవి, గిరినాథ్ ప్రసన్న, వైకుంఠం పద్మ, రాము రజని, సత్యం పద్మలత, కృష్ణ శివరంజని, ఏడుగురు కుమారులు కోడళ్ళు ప్రతి సంవత్సరం సీతారాముల కల్యాణాన్ని ఇంటి లో జరుపుచు వస్తున్నారు. పూర్వికులు వైకుంఠం, జనార్ధన్, కొనసాగించిన సితరామ కల్యాణాంను వారి కుమారులు నేటికీ నిర్వహించడం మండల ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాది. దశరధుడి మాటకు కట్టుబడిన కుమారుల వలె గన్ను జనార్ధన్ ఏడుగురు కుమారులు నేటికీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారు. నూట పదిమంది పైన కుటుంబం నేడు ఏడుగురి తో ఏర్పడింది, గురువారం జరిగిన సీతారాముల కళ్యాణం లో కుటుంబ సభ్యులే 100 మంది పైన ఉండడం తో మండలంలో ఒక చర్చగా మారింది . సీతారాముల కళ్యాణ క్రతువు, వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.పుర ప్రముఖులు బంధుమిత్రులను 90 సంవత్సరాల నుంచి ఈ కుటుంబం సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారని అందరినీ ఆనందానికి గురిచేసింది .
గన్ను కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం




