హుజూర్ నగర్ మార్చి 30 (జనంసాక్షి): హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి దొంతగాని లక్ష్మమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయినందుకు గాను గిరిజన నాయకులు సన్మానం చేశారు.
గురువారం ఈ సందర్భంగా గిరిజన హక్కుల పోరాట సమితి(GHPS) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ నగేష్ రాథోడ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ ను మరింత అభివృద్ధి చేయాలన్నారు. దళారి వ్యవస్థను నిర్మూలించాలన్నారు. రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు(GHPS) అడ్వకేట్ నగేష్ రాథోడ్, మాజీ సర్పంచ్ బానోతు వెంకటేశ్వర్లు నాయక్, తులసి రామ్ నాయక్, డాక్టర్ జిలేంద్రుడు, భూక్యా నాగు నాయక్, టీ టైం ఓనర్ చందు నాయక్, సిరి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నాగు నాయక్, కైలాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మమ్మ కి, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సన్మానం




