సూర్యాపేట : కేసీఆర్ స్వార్థం కోసమే తెలంగాణ ప్రజలతో రాజకీయాలు చేస్తున్నారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్శింహులు విమర్శించారు. శనివారం నల్గోండ జిల్లా సూర్యాపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని 12 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ వాదంతో మోసం చేసినందుకు నిరసనగా ఈ నెల 25న హైదరాబాదులోని గన్‌పార్క్‌లోని తెలంగాణ అమర వీరుల స్థూపం దగ్గర ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలియజేశారు. పార్లమెంటులో తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు.




