హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలుగుదేశం పార్టీ గస్ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో కిడ్నాప్‌లు, దొమ్మీలు పెరిగిపోయాయన్నారు. రాజకీయ నేతలే భూ కజ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. తెరాస, కాంగ్రెస్ నేతలు కలిసి భూదందాలు చేస్తున్నారని మరో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో ఎవరైన కొత్తగా పరిశ్రమలు పెట్టాలంటే నేతలకు ముడుపులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం వైఫల్యంపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.




