Tuesday, 3 November 2026

గరీబ్‌నగర్‌లో ప్రభుత్వ ఖర్చుతోనే నల్లాల ఏర్పాటు’

evluxk9yవరంగల్: జిల్లాలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలోని గీసుకొండ మండలం గరీబ్‌నగర్‌లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటించారు. ఇవాళ తన పర్యటనలో ఆయన గరీబ్‌నగర్‌లోని మురికివాడలను పరిశీలించారు. అనంతరం సీఎం గరీబ్‌నగర్‌వాసులు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… ఈ కాలనీలో పేదలంతా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇండ్లను నిర్మించుకున్నారని తెలిపారు. ఈ భూములన్నింటిని పేదలకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామన్నారు. అంతేకాదు పేదలకు పక్కా ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఇంటిలో మంచినీటి నల్లాలను పెట్టిస్తామని తెలిపారు. కాలనీలో ఏ ఒక్క మహిళ మంచినీటి కోసం రోడ్డుపైకి రాకూడదని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా మహిళ మంచినీటి కోసం రోడ్డుపై కనిపిస్తే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఛమత్కార దోరణిలో హెచ్చరించారు. సీఎం వస్తే సమస్యలు భయపడి పారిపోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *