గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
కొల్లాపూర్ రూరల్ డిసెంబర్ 21(జనంసాక్షి ) కొల్లాపూర్ మండలం పరిధిలోని మత శిశువు యాబైపడకల ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్ ఎంపీపీ సభవత్ భోజ్యనాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు న్యూట్రిషన్ కిట్లలో గర్భిణీ స్త్రీలకు రక్తహీనతను అరికట్టేందుకు కావాల్సిన ఆరు రకాల పౌష్టికాహారం పదార్థాలు అయినటువంటి, హార్లిక్స్, ఐరన్ సిరఫ్, ఖార్జురం, నెయ్యి, అల్పాదోహల్ మాత్రలు కప్పు,భాస్కట్ ని అందజేశారు.దీనిని గర్భిణీ స్త్రీలు సద్వినియోగం ఉపయోగించుకోవాలని చాలా మంచి బృహత్కార కార్యక్రమని ఇలాంటి కార్యక్రమాo ఏ రాష్టంలో లేదని,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాల్లోని గర్భిణులకు కిట్లు పంపిణీ చేశారు గర్భిణులకు అద్భుతమైన పథకమని కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు గర్భం దాల్చాక మూడో నెలలో ఒక్కసారి ఐదో నెలలో మరోసారి దీన్ని అందజేస్తారని ఈ కిట్‌కు దాదాపు రూ.2 వేల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతు బంధు హాస్పిటల్ అధ్యక్షుడు కాటం జంబులయ్య రైతు బంధు అధ్యక్షుడు నిరంజన్ సింగిల్ విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య రామాపురం సర్పంచ్ భారతి ఎంపీటీసీ వరలక్ష్మీ ముక్కిడిగుండం సర్పంచ్ దశరథం నాయక్ svs సంస్ధ డైరెక్టర్ లక్ష్మణ్ రావ్ డాక్టర్లు శ్రీనివాసరావు వెంకటేష్ జయ ప్రసాద్,భరత్ చంద్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ




